Mancherial District News:-
మూడు రోజుల క్రితం మంచిర్యాల జిల్లాలోని
శ్రీరాంపూర్ సింగరేణి జిఎం కార్యాలయం ముందు పెద్దపులి సంచరించిన విషయం తెలిసిందే. అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి పులి అడుగు జాడల ఆధారంగా జైపూర్ అడవి ప్రాంతం వైపు వెళ్లినట్లు నిర్ధారణకువచ్చారు. తాజాగా ముదిగుంట గ్రామ శివారులో పులి పాడి బర్రెపై దాడిచేసి చంపేసింది. దింతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు పులిని బందించి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.