Kasipet Mandal News:-
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో ఈరోజు
భారతీయ జనతా పార్టీ మండల కమిటీని మండల అధ్యక్షుడు కాల్వ సతీష్ రెడ్డి గారు, బెల్లంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి కొయ్యల ఏమాజి గారు, జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ గారు ప్రకటించారు. ఈ సందర్బంగా బీజేపీ మండల అధ్యక్షుడు కాల్వ సతీష్ రెడ్డి గారు మాట్లాడుతూ కాసిపేట మండలంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయడానికి కమిటీ సభ్యులను నియమించినట్లు తెలిపారు. బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులుగా పోలవేణి పొశం, రాజన్ ప్రభుదాస్, మనోజ్ దాస్, దుర్గం రాజలక్మి, ప్రధాన కార్యదర్శిలుగా కనుకుంట రాజశేఖర్, దేవునూరి సంతోష్, కార్యదర్శిలుగా పొగుల సతీష్, బ్రిజేష్ కుమార్, మాజీ బాలాజీ, బానోతు రవికుమార్, కోశాధికారిగా దోమల రాంచందర్, మహిళ మోర్చా అధ్యక్షులు గా పెరుగు రాజు, యువ మోర్చా అధ్యక్షుడుగా మాదాసు సురేష్, గిరిజన మోర్చా అధ్యక్షుడుగా పెంద్రం గుణవంత్ రావు, బీసీ మోర్చా అధ్యక్షుడుగా పెద్దపల్లి శంకర్, కిసాన్ మోర్చా అధ్యక్షుడుగా అల్లంల సమ్మయ్య గార్లను ప్రకటించడం జరిగింది.