Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో ధర్మారావుపేట గ్రామ
నూతన ప్రత్యేక అధికారిగా ఈవోపీఆర్డీ మేఘమాల గారు ఈరోజు మండల ఎంఈవో దామోదర్ గారి చేతులమీదుగా బాధ్యతలు తీసుకున్నారు. ధర్మారావుపేటలో పంచాయతీ ఎన్నికలు జరగక పోవడం వల్ల గతంలో కాసిపేట మండల ఎంఈవో దామోదర్ గారు స్పెషల్ ఆఫీసర్ గా అదనపు బాధ్యతలు తీసుకున్నారు. ఈవోపీఆర్డీ మేఘమాల గారు దేవాపూర్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం దేవాపూర్ పంచాయతీ నూతన కార్యదర్శిగా ఉదయ్ కుమార్ గారు నియామకం కావడంతో మేఘమాల గారు ధర్మారావుపేట స్పెషల్ ఆఫీసర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించరు.