Kasipet Mandal News:-
తెలంగాణ కాంగ్రేస్ పార్టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్
కుమార్ రెడ్డి గారు తల పెట్టిన జల దీక్ష కార్యక్రమంలో భాగంగా కాసిపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మిడి హెట్టి పోయే క్రమంలో పోలీసు వారిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ హయంలో కట్టిన ఎల్లంపల్లి, తుమ్మిడి హెట్టి నీళ్లకు సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ కు తరలించి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 5నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుల డిసైన్లు మారుస్తూ వేల కోట్ల కమిషన్లు దండుకుంటున్నారని, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర కాంగ్రేస్ నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని అన్నారు. అసలు తెలంగాణాలో ప్రజాస్వామ్య పాలనా నడుస్త లేదని, దొరల పాలనా నడుస్తున్నదని, నిజాం కంటే ఎక్కువగా అణిచేత తెలంగాణలో ఉన్నదని, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు ప్రగతి భవన్ గడీలను కూల్చుతారని హెచ్చరించారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దూడం మహేష్, గోమాస భీమయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు రత్నం ప్రదీప్, భరత్, పొట్ట బత్తుల సంపత్ తదితరులు అరెస్ట్ అయినా వారిలో ఉన్నారు.