Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది

Kasipet Mandal News:-
స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా ఈరోజు
కాసిపేట మండలంలోని సోమగూడెం(k) గ్రామపంచాయతీలో మండల అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి సంజీవరావ్ గారు మాట్లాడుతూ వచ్చే వర్షాకాలలో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ఇప్పటికే ప్రపంచం కరోనా వైరస్ తో అల్లాడుతుందని అన్నారు. గ్రామాలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, శానిటేషన్ నిర్వహించాలని సర్పంచులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, ఎంపీడీఓ ఎంఏ అలీం, పంచాయతీ కార్యదర్శి శ్యామ్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App