Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ప్రధాని మోడీ పాలన గురించి ప్రజలకు సందేశం

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో ఈరోజు భారత ప్రధాని
నరేంద్రమోడీ గారు రెండవసారి ప్రధాని అయి సంవత్సరం పూర్తి అయిన సందర్బంగా మహాత్మా గాంధీ, భారత మాత చిత్రపటాలకు పూలమాల వేశారు. ఆ తరువాత 26వ పోలింగ్ బూత్ పరిధిలో గల ఇంటింటికి వెళ్లి మోడీ గారు తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణం, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్బర్ భారత్ అభియాన్ లాంటి నిర్ణయాలను ప్రజలకు తెలిపారు. ఆ తరువాత నాయకులు, కార్యకర్తలు సమావేశం అయి మండలంలో గల రెండు సింగరేణి భూగర్భ గనులు మరియు ఓపెన్ కాస్ట్ ల  వల్ల ప్రజలకు ఏర్పడ్డ త్రాగునీటి సమస్య గురించి చర్చించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు సింగరేణి యాజమాన్యం త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కాల్వ సతీష్ రెడ్డి గారు, మండల ప్రధాన కార్యదర్శి కె.రాజశేఖర్ గారు, మండల నాయకులు పెరుగు రాజు, అటుకపురం రమేష్, పి పొశం, పెద్దపల్లి శంకర్, సంజీవ్ కుమార్ సింగ్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App