మంచిర్యాల జిల్లాలో గత కొన్ని రోజులనుండి పులి అలజడి రేపుతుంది. స్టేషన్ పెద్దనపల్లిలో ప్రత్యక్షం అయిన పెద్దపులి Kk2 ఓసీ, RK8, శ్రీరాంపూర్ జీఎం కార్యక్రమం ప్రాంతం నుండి జైపూర్ మండలంలోకి ప్రవేశించింది. జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామంలో పాడి గేదెపై దాడి చేసి చంపింది. రెండు రోజులక్రితం వేమనపల్లి మండలంలోకి ప్రవేశించింది. తాజాగా నిన్న రాత్రి కాటేపల్లి అడవి ప్రాంతంలో రెండు పశువులపై దాడి చేసి చంపింది. పులి జనారణ్యంలో సంచరిస్తూ పశువులపై దాడిచేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.