ఈరోజు సూర్య గ్రహణం సందర్భంగా కాసిపేట మండలంలోని ఆలయాలను మూసివేశారు. ఉదయం 10.15 గంటలకు గ్రహణం ప్రారంభమయ్యాయి, 1.44 గంటలకు ముగియనుంది. గ్రహణం ముగిసిన అనంతరం తిరిగి ఆలయాలను తెరిచి శుద్ధి చేయనున్నారు. ఈరోజు యుగాంతం అని, ప్రపంచం అంతం కాబోతుందనే వదంతులు వస్తున్నాయి. నిన్న రాజస్థాన్ రాష్ట్రంలోని సాంచోర్ పట్టణంలో ఆకాశం నుండి వింత వస్తువు పడడంతో కొందరు యుగాంతం అనే వాదనను బలంగా నమ్ముతున్నారు. ఐతే ఈ వాదనలను సైంటిస్టులు కొట్టిపారేస్తున్నారు. ఆకాశం నుండి పడ్డది గ్రహశకలం మాత్రమే అని, కొన్ని సంవత్సరాల వరకు భూమికి ఏ ప్రమాదం లేదని చెబుతున్నారు.