Singareni News:-
తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది తీరం వెంబడి
కొత్తగా 32 బొగ్గు బ్లాక్‌లను బొగ్గు అన్వేషణ విభాగం గుర్తించినట్లు సమాచారం. ఈ 32 బ్లాక్‌లలో 11 బ్లాక్‌లు మంచిర్యాల మరియు ఆసిఫాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయి. ఈ 11 బ్లాక్‌లలో సుమారు 250 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అన్వేషణ విభాగం వారు అంచనా వేస్తున్నారు. అయితే ఈ బొగ్గు బ్లాక్‌లను ప్రైవేట్ సంస్థలకు కేటాయిస్తారా లేదా సింగరేణికి కేటాయిస్తారా అనేది వేచిచూడాలి.