కాసిపేట మండల కేంద్రంలోని ధర్మారావుపేట వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో కంది మరియు వరి (బీపీటీ, తెలంగాణ సోనా) విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి వందన గారు తెలిపారు. రైతులు సహకార సంఘం కార్యాలయంలో సంప్రదించి విత్తనాలను తీసుకెళ్లాలని ఆమె సూచించారు. రైతులు తమవెంట ఆధార్ కార్డు మరియు పట్టా పాస్ బుక్ తీసుకురావాలని అన్నారు.