Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఉద్యమకారులకు సన్మానం

Kasipet Mandal News:-
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో కాసిపేట మండలంలోని ఉద్యమకారులను ఈరోజు సన్మానించారు. కాసిపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో మండలం ఐకాస కన్వీనర్ శిలోజు మురళి, అమరణ నిరాహార దీక్ష చేసిన బన్న ఆశాలు, ఉద్యమ కారులు సిరోజు ఖాన్, కొమ్ముల బాపులను ఉద్యమ సమయంలో వారు చేసిన కృషిని గుర్తుచేసుకొని సర్పంచ్ ధరావత్ దేవి గారు, SCV అధ్యక్షులు పల్లె మల్లయ్య గారు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముందు తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేశారు. SCV ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు తెలంగాణ ఉద్యమ గీతాన్ని ఆలపించారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App