ధర్మారావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఈనెల 20వ తేది నుండి 27వ తేది వరకు పంట రుణాలను రెన్యువల్ చేయనున్నట్లు PACS అధ్యక్షురాలు నీల రాంచందర్ గారు తెలిపారు. సొసైటీ నందు బకాయి ఉన్న రైతులు సొసైటీ కార్యాలయంలో వారి బకాయిపై చెల్లించవలసిన వడ్డీ ని చెల్లించి పంట రుణాన్ని రెన్యువల్ చేసుకోవాలని అన్నారు. బకాయి పై చెల్లించవలసిన వడ్డీని చెల్లించని రైతుల వడ్డీని వారి బకాయికి కలపి బకాయి మొత్తమును పెంచడం జరుగుతుందని పేర్కొన్నారు.