Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

NMMS కి మండలం నుండి ముగ్గురు విద్యార్థులు

Kasipet Mandal News:-
కాసిపేట మండలం నుండి ఈ సంవత్సరం
ముగ్గురు విద్యార్థులు NMMS (నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్) కి అర్హత సాధించారు. ధర్మారావుపేట జిల్లా పరిషత్  సెకండరీ పాఠశాల నుండి మామిడి సోనీ, ముత్యం పూజిత, తెలంగాణ మోడల్ స్కూల్ కాసిపేట నుండి పల్లి సుషర్మిత NMMS కి సెలెక్ట్ అయ్యారు. దేశంలో ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభ కలిగిన కొందరు విద్యార్థులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ స్కాలర్‌షిప్ విధానాన్ని తీసుకువచ్చింది. వీరు సంవత్సరానికి 12,000 రూపాయల స్కాలర్‌షిప్ ని ప్రభుత్వం నుండి పొందనున్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App