మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేచిని గ్రామంలో దారుణం జరిగింది. పోశం - శంకరమ్మ దంపతులపై కొందరు గుర్తుతెలియనిి వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. భర్త పోశం మృతి చెందగా... భార్య శంకరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. శంకరమ్మను చికిత్స కోసం కరీంనగర్ హాస్పటల్ కి తీసుకెళ్లారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. భూతగాదాలే దాడికి కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.