మంచిర్యాల మున్సిపాలిటీ ఏరియాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మంచిర్యాలలోని ఓ మాంసం దుకాణం యజమాని తండ్రికి (65) కరోనా పాజిటివ్ అని నిర్ధారణయింది. కొన్ని రోజుల క్రితం అతనికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరినట్లు సమాచారం. చికిత్స పొందే సమయంలోనే వైరస్ బారిన పడిఉండవచు అని అధికారులు భావిస్తున్నారు. మంచిర్యాల పట్టణ ప్రాంతంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అతనితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.