Mancherial District News:-
మంచిర్యాల జిల్లాలో మరో రెండు కరోనా
పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉండడం డిపార్ట్మెంట్లో గుబులు పుట్టిస్తుంది. ఈ రెండు కేసులు కలుపుకొని ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 44కు చేరింది. లాక్ డౌన్ ఆంక్షలు సడలించడం, ప్రజారవాణా పెరగడం, కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం జిల్లా ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది.