Mancherial District News:-
మంచిర్యాల జిల్లాలో గత నాలుగు రోజుల
నుండి పులి సంచరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం రాత్రి శ్రీరాంపూర్ సింగరేణి జిఎం కార్యాలయం ముందు పులి రోడ్డు దాటడం వాహనదారులు గమనించారు. విషయం తెలియడంతో అటవీశాఖ అధికారులు, పోలీసులు స్థలాన్ని పరిశీలించి పులి అడుగు జాడలను గుర్తించారు. పులి కాన్కుర్ అడవి ప్రాంతానికి వెళ్లినట్లు నిర్ధారణకు వచ్చారు. పాలు, కూరగాయలు అమ్ముకునే వ్యక్తులు ఈరోజు ఉదయం కాన్కుర్ అడవి ప్రాంతంలో పులిని చూసినట్లు చెబుతున్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, పులి కనిపిస్తే తమకు సమాచారం అందించాలని సిపి సత్యనారాయణ గారు సూచించారు.