మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని రెచిని గ్రామంలో గురువారం రాత్రి ఇద్దరు చిన్నారులు వ్యవసాయ బావిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలలోకి వెళ్తే తిరుమల్(15) , మహేష్ (8) అనే ఇద్దరు చిన్నారులు ఈత రాకపోయినా సరదాగా ఈత కొట్టడానికి బావిలోకి దిగి మృతిచెందారు. చీకటి పడ్డ ఇంకా ఇంటికి రాకపోవడంతో వీరికోసం వెతుకుతూ బావి దగ్గర చూసేసరికి నీటిలో చనిపోయి కనిపించారు. దింతో తల్లి, తండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతదేహాలను పోస్టుమర్డర్ కోసం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తాండూర్ ఎస్ఐ శేఖర్ గారు తెలిపారు.