మంచిర్యాల జిల్లాలో కరోనా కేసుల సంఖ్య
పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపార సంస్థల సంఘాలు, దుకాణదారులు స్వీయంగా ఆంక్షలను విధించుకుంటున్నారు. కాసిపేట మండలం సోమగూడెంలోని సెలూన్ షాపులను ఈరోజు నుండి జులై 7వ తేదీ వరకు మూసివేయాలని నాయీ బ్రాహ్మణ సేవ సంఘం వారు నిర్ణయించారు. బెల్లంపల్లిలో పట్టణంలో ఇప్పటికే వ్యాపారాలను సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని తీర్మానం చేసుకున్నారు. మందమర్రి మార్కెట్ లోని అన్ని దుకాణాలు ఈరోజు నుండి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే ఉండనున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వ్యాపార సంస్థలు, దుకాణాలు రేపటి నుండి సాయంత్రం ఆరు గంటల తరువాత మూతబడనున్నాయి.