Mancherial District News:-
మంచిర్యాల జిల్లా నుండి మహారాష్ట్ర వైపుగా
వెళ్తున్న ఓ వాహనంలో మహారాష్ట్ర పోలీసులు రూ. 2.20కోట్ల నగదు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. తునికాకు కాంట్రాక్టర్‌కు సంబందించిన వాహనంగా పోలీసులు గుర్తించారు. మంచిర్యాలకు చెందిన ఇద్దరు తునికాకు కాంట్రాక్టర్లతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడ్డ కాంట్రాక్టర్లు మాత్రం ఆ డబ్బు తునికాకు లేబర్‌కు పంచడానికి తీసుకువెళుతున్నట్లు చెబుతున్నారు. కానీ ఈ నగదుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.