కాసిపేట మండలంలోని మద్దిమడ గ్రామంలో రెండు కోట్ల రూపాయల నిధులతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వంతెనను ఈరోజు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ గారు, కాసిపేట తెరాస పార్టీ అధ్యక్షులు రమణా రెడ్డి గారు మరియు ఎంపీపీ రొడ్డ లక్ష్మి గారు, వైస్ ఎంపీపీ విక్రమ్ గారు, జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య గారు, సింగిల్ విండో చైర్మన్ నీల గారు, ఎంపీటీసీ లు ,సర్పంచ్ లు, తెరాస కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.