Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

పండ్లు, జ్యూస్, మాస్కుల పంపిణి

Kasipet Mandal News:-
ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి జన్మదిన
వేడుకలను ఈరోజు కాసిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు బెల్లంపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రత్నం ప్రదీప్ గారి ఆధ్వర్యంలో కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండ్లు, జ్యూస్, మాస్క్ లను పంపిణీ చేశారు. కరోనా సమయంలో డాక్టర్స్ చేస్తున్న సేవలకు డా.శ్రీదేవి గారిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ గోనె శ్రీకాంత్, ST సెల్ కాసిపేట మండల అధ్యక్షులు గుండా రాజ్ కుమార్, మహేష్ ఆనంద్, బోర్లకుంట రాజు, వినోద్, కిరణ్ పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App