Kasipet Mandal News:-
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో
ప్రభుత్వ నిషేధిత నకిలీ పత్తి విత్తనాలు అక్రమంగా తరలిస్తున్నరని కాసిపేట పొలీస్, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందడంతో దుబ్బగుడెం వద్ద ఈరోజు వాహనాలను తనిఖీ చేసారు. ఈ సందర్భంలో కారులో అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల ప్రభుత్వం నిషేదించిన పత్తి విత్తనాలనాలు అధికారులు పట్టుకున్నారు. నిందితులు ధర్మారావుపేట గ్రామానికి చెందిన చింతల గట్టయ్య, దేవసాని నారాయణ లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాములు గారు తెలిపారు. ఈ విత్తనాల విలువ సుమారు 1లక్ష 62 వేల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. ఈ టాస్క్ లో కాసిపేట వ్యవసాయ అధికారి వందన గారు, కాసిపేట ASI శంకరయ్య గారు, ఏఈ ఓ శ్రీధర్ గారు, కానిస్టేబుల్ శ్రీనివాస్ గారు ఉన్నారు.