కాసిపేట తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు ఆదివాసీ నాయకులు భూ సమస్య పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ సోనాపూర్ గ్రామపంచాయతీలోని నాయకపుగూడ గ్రామ రైతు బక్క రాజయ్య సర్వే నెంబర్ 40 లో గల విస్తీర్ణం 4.20 గుంటల భూమిని గత 40 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నాడని, అయితే దీనిపై వేరే వ్యక్తులు గత నెల రోజుల నుండి మా భూమి అని అడ్డు వస్తున్నారని అన్నారు. కాసిపేట తహసీల్దార్ గారికి న్యాయం కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొమ్ముల బాపు, కనక రాజు, కురిసేంగా నాగేశ్వర్రావు, బద్ది. శ్రీనివాస్, ఆత్రం.జంగు, కొట్నాక. తిరుపతి, కురిసేంగా.తిరుపతి, బక్క. రాజయ్య పాల్గొన్నారు.