ప్రతిఒక్కరు ఇంటినుండి బయటికి వచ్చేటప్పుడు మాస్కులు తప్పకుండ ధరించాలని దేవాపూర్ ఎస్ఐ దేవయ్య గారు అన్నారు. కొందరు మాస్కులు ధరించకుండా ఇష్టారాజ్యంగా బయటకు వస్తున్నారని, మాస్కులు లేకుండా బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మన పక్క మండలం బెల్లంపల్లిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7కి చేరిన విషయం తెలిసిందే.