కాసిపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బుగ్గగుడెం గ్రామంలో ఈరోజు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్ కిరణ్మయి గారు వైద్యపరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రవీందర్, సబ్ యూనిట్ ఆఫీసర్ ప్రభాకర్, హెచ్ఈఓ సత్యనారాయణ, ఏఎన్ఎం ఉమాదేవి, హెల్త్ అసిస్టెంట్ నారాయణ, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.