కాసిపేట మండలంలో గురువారం హరిత హారం 6 వ విడత కార్యక్రమం ప్రారంభమయిన విషయం తెలిసిందే. మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు అందరు కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటుతున్నారు. మొక్కలను 33కేవీ విద్యత్ లైన్ సమీపంలో నాటవద్దని, ఆలా నాటడం వలన భవిషత్తులో సమస్యగా మారే అవకాశం ఉందని విద్యుత్ శాఖ వారు పేర్కొంటున్నారు. చెట్లు విద్యుత్ లైన్ కి తగలడం వలన లైన్ వైర్లు తెగిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. విద్యుత్ లైన్ లకు దూరంగా మొక్కలను నాటాలని సూచిస్తున్నారు.