కాసిపేట మండలంలోని ముత్యంపల్లి, కొండాపూర్, దేవాపూర్ గ్రామాలలోని ఫర్టిలైజర్ షాపులలో ఈరోజు ఏ.డి.ఏ సురేఖ గారు మరియు ఏవో వందన గారు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్బంగా వారు రికార్డులను, విత్తనాలను పరిశీలించారు. నకిలీ విత్తనాల అమ్మకం నేరమని, ఆలా అమ్మిన వారిపై చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. వేప నూనె మరియు జీవన ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు.