Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో ఈరోజు డ్రై ఫ్రైడే లో
భాగంగా గ్రామాలలో పారిశుద్ధ్య పనులను నిర్వహించారు. నీళ్లు నిల్వ ఉండే చోట బ్లీచింగ్ పౌడర్ చల్లి దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. వినియోగం లేని పాత్రలలో నిల్వ ఉన్న వర్షపు నీటిని తొలగించారు. ప్రజలకు వర్షాకాలంలో దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు ఉన్నారు.