మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గంగా కాలనీలో సింగరేణి క్వార్టర్స్‌లో నివాసం ఉండే ఓ కానిస్టేబుల్ గత నెల 31న తన కుమారుడి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. వేడుకలో తోటి పోలీసులు, బంధుమిత్రులు, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు. కానిస్టేబుల్ కి కరోనా లక్షణాలు బయటపడడంతో పరీక్షలు నిర్వహిస్తే జూన్ 8న కరోనా పాజిటివ్ అని తేలింది. అప్రమత్తం అయిన అధికారులు వేడుకలో పాల్గొన్న 24 మందిని హోమ్ క్వారన్టైన్ లో ఉంచారు. వీరిలో ఇద్దరికి రెండు రోజుల క్రితం, మరో ఇద్దరికి నిన్న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ నలుగురిలో సింగరేణి కార్మికుడు కూడా ఉన్నాడు. అతను జూన్ 4వ తేది వరకు గనిలో పని చేసాడని సమాచారం. గనిలో పని సమయంలో సామజిక దూరం పాటించడం కష్టం. కార్మికునికి కరోనా రావడంతో, 10రోజుల క్రితం వరకు విధులకు రావడంతో తోటి కార్మికులలో ఆందోళన నెలకొంది.