Kasipet Mandal News:-
లాక్ డౌన్ వల్ల ప్రజలు ఉపాధి కోల్పయి ఇబ్బందులు పడుతున్నారని వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ప్రతి పెదకుటుంబానికి ఆరు నెలపాటు రూ.7500, ప్రతి వ్యక్తికి ప్రతినెల 10 కేజీల బియ్యం ఇవ్వాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందజేయాలని, కరెంట్ బిల్లులు రద్దు చేయాలన్నారు. అలాగే బొగ్గు బావుల ప్రయివేటి కరణ విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సంకే రవి, సోమగూడెం ఉప సర్పంచ్ కనుకుల రాకేష్, వార్డు సభ్యులు సపాట్ మల్లేష్, ఆజ్మీరా స్వప్న, సంకే రాజకుమారి, యూత్ నాయకులు ప్రేమ్, శ్రీనివాస్, రాజా, మరియు దేవాజి, రాజమ్మ, పద్మ, రాజు పాల్గొన్నారు.