Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మండలంలో పర్యటించిన జిల్లా అదనపు కలెక్టర్

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని గ్రామాలలో నిర్వహిస్తున్న
ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం లోని పనులను జిల్లా అదనపు కలెక్టర్ త్రిపాఠి గారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రతిపాదించిన లక్ష్యాలను నిర్దిష్ట సమయం లోపు పూర్తి చేయాలని సూచించారు. ఈ నెల 10వ తేదీలోగా ఇంకుడు గుంతల నిర్మాణం, 20వ తేదీలోగా డంప్ యార్డ్ పనులు, 30వ తేదీలోగా స్మశాన వాటిక నిర్మాణ పనులను పూర్తిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో ఎంఏ అలీం, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App