Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

జిల్లాలో పదోతరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు

Mancherial District News:-
మంచిర్యాల జిల్లాలో పదవ తరగతి పరీక్షల
ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అంతా సానుకూలంగా జరిగితే ఎల్లుండి నుండి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 58 పరీక్ష కేంద్రాలు ఉండగా కరోనా దృష్ట్యా 113 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పరీక్ష కేంద్రాలలో మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు, హైడ్రోక్లోరైడ్ ద్రావణం, థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు మాస్కులు ధరించి పరీక్ష కేంద్రాలకు హాజరుకావాలని జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 11,481 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పరీక్షలలో విద్యార్థులు హాజరు కాకపోయినా సప్లమెంటరీ పరీక్షలలో హాజరవ్వచ్చని, అప్పుడు ఉతీర్ణత సాధించినా వారిని రెగ్యులర్ విద్యార్థులుగానే గుర్తిస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App