Mancherial District News:-
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని
మాడవెల్లి గ్రామంలో నిన్న ఇద్దరు చిన్నారులు ఈతకు వెళ్లి నీట మునిగి మరణించిన విషయం తెలిసిందే... కొడుకు ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ఓ తల్లి గుండె ఆగిపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. సత్యనారాయణ, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు సంతానం. వారికీ ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ వీరు జీవనం సాగిస్తున్నారు. చదువు మానేసిన పెద్ద కుమారుడు సంపత్ తండ్రికి వ్యవసాయ పనులలో సహాయం చేస్తున్నాడు. వారం రోజుల క్రితం సంపత్ మరియు అతని స్నేహితుడు రాంచరణ్ ఇద్దరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. సంపత్, రాంచరణ్ లతో పటు మరో ముగ్గురు పిల్లలు శనివారం గ్రామ శివారులో ఉన్న వాగులో సరదాగా ఈతకు వెళ్లారు. ఈత కొట్టే సందర్భంలో నీట మునిగిన సంపత్, రాంచరణ్ లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
కుమారుడు ఈతకు వెళ్లి చనిపోయాడనే వార్త వినగానే సంపత్ తల్లి రాజేశ్వరి (35) కుప్పకూలింది. శనివారం మధ్యాహ్నం నుంచి ఏమీ తినకుండా, కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా రోదిస్తూ ఉండిపోయింది. తన కొడుకు అకస్మాత్తుగా చనిపోవడాన్ని ఆ తల్లి తట్టుకోలేక పోయింది. స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. రాత్రి 11.30 గంటల సమయంలో బెల్లంపల్లి హాస్పిటల్కు తీసుకెళ్తుండగా గుండెపోటుతో చనిపోయింది. 12 గంటల వ్యవధిలోనే తన కొడుకు, భార్యను పోగొట్టుకోవడంతో సత్యనారాయణ, ఆయన పదేళ్ల కూతురు దిగ్భ్రాంతిలోకి వెళ్లారు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి కూడా మరణించడంతో గ్రామంలో తీర్వ విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరి మృతదేహాలకు ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.