కాసిపేట మండలంలో లాక్ డౌన్ వల్ల
ఇబ్బంది పడుతున్న పేదలకు సహాయకాలు కొనసాగుతున్నాయి.
- దేవాపూర్ గ్రామంలో యువ శక్తీ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు 20 మంది పేదలకు నిత్యవసర వస్తువులు మరియు బియ్యం పంపిణీ చేసారు.
- సోమగుడెం(కే) గ్రామ పంచాయతీ నివాసి లటుకూరి ప్రకాష్ గారు వారి కొడుకు సాయి పుట్టిన రోజు సందర్బంగా సర్పంచ్ శంకర్ గారి ఆధ్వర్యంలో 30 కుటుంబాలకు కూరగాయలు అందించారు.
- కొత్త తిరుమలాపూర్ మరియు పాత తిరుమలాపూర్ గ్రామాలలో జాడి శ్రీనివాస్ వారి మిత్రులు 30 ఆదివాసీ కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు.