Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి
చెందిన రాగుల అంజన్న, రాకేష్ అనే అన్నదమ్ములు ఎడాది వ్యవదిలో తల్లిదండ్రులను కోల్పోయారు. అనాథలైన చిన్నారులను కూలి పనులు చేస్తూ వాళ్ళ అమ్మమ్మ సాడుతుంది. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల కూలి పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలిసిన శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ మంచిర్యాల జిల్లా అద్యక్షులు శ్రీ సుబాస్ చందర్ రెడ్డీ గారు స్పందిస్తు రూ.2000‚ 20కిలోల బియ్యం మరియు నెలకు సరిపడ నిత్యవసర వస్తువులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి దేవపుర్, శ్రీ సత్యసాయి భజనా మండలి సభ్యులు శ్రీ రామటేంకి రాజలింగు‚ శ్రీ దుర్గం ప్రసాద్ మరియు ఆ గ్రామస్తులు జె ఆనంద్, ఎడ్డవేని శంకర్ పాల్గోన్నరు.