Kasipet Mandal News:-
కరోనా వైరస్ విజృంభణతో ప్రభుత్వము
లాక్ డౌన్ విదించినందున కూలి పని చేసుకొని జీవనం సాగించేవారు ఉపాధి లేక ఇబ్బందులు పడుతుండడంతో సామాజిక చైతన్య వేదిక వారు వెంకటాపూర్ పంచాయతీలోని లక్ష్మీపూర్ రెండు గోండు గూడా ప్రజలకు సహాయం చేసారు. దాతల సహకారంతో నిధులను సేకరించి, రెండు గ్రామాలలోని 20 కుటుంబాలకు ఒకరికి 350 రూపాయల చొప్పున నూనె, పప్పులు, కారం పసుపు సబ్బులు తదితర 11 నిత్యవసర వస్తువులను గ్రామ సర్పంచి మడావి సౌందర్య శంకర్, సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య, ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు, సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య ల చేతుల మీదుగా అందజేశారు. అలాగే కరోనా వైరస్ బారిన పడకుండా తమ ఆరోగ్యాలను ఎలా కాపాడుకోవాలో గిరిజనులకు దేవాపూర్ గ్రామానికి చెందిన ఆర్.ఎం.పి డాక్టర్ సత్యనారాయణ, సామాజిక చైతన్య వేదిక ఉపాధ్యక్షుడు గొడిసెల రాజేశం, సామాజిక చైతన్య వేదిక యూత్ కమిటీ ప్రధాన కార్యదర్శి బద్ది శ్రీనివాస్ ఆరోగ్య చిట్కాలు వివరించారు. ఈ కార్యక్రమంలో సామాజిక చైతన్య వేదిక సహాయ కార్యదర్శి ఎంబడి కిషన్, సభ్యులు రోడ్డు చిన్న రమేష్, గణపతి, కొమ్ముల సంజీవ్, తదితరులు పాల్గొన్నారు. విరాళాలు అందజేసిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు, ఇంకా ఎవరైనా దాతలు ముందుకొచ్చి విరాళాలు పంపిస్తే నిరుపేదలను గుర్తించి అందజేస్తామని కోరారు.