కాసిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి
చెందిన రాగుల అంజన్న, రాకేష్ అనే అన్నదమ్ములు ఎడాది వ్యవదిలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారని నాలుగు రోజులక్రింద Kasipet Mandal App లో కథనం ప్రచురించాము. మనవంతు సహాయం వాట్సాప్ గ్రూప్ వారు కరోనా లాక్ డౌన్ సమయం నుండి కాసిపేట మండలంలో నిరుపేదలకు, మారుమూల ఆదివాసీ ప్రజలకు విశేషంగా సేవలందిస్తున్నారు. ఈరోజు గ్రూప్ సభ్యులు విరాళాలను సేకరించి 12,316/- రూపాయలను అనాధ పిల్లలకు ఆర్థిక సహాయం చేసారు. అంతే కాకుండా ఎంపీటీసీ అక్కపెల్లి లక్ష్మి గారు, వార్డ్ సభ్యులు రేణుక గారు పిల్లలిద్దరికీ మొత్తం 6 డ్రెస్స్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రం రావు గారు, సర్పంచ్ అడే బాదు గారు, కాసిపేట్ ఎంపీటీసీ అక్కపెల్లి లక్ష్మి గారు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి గారు, తెరాస కాసిపేట మండల ఉపాధ్యక్షులు అగ్గి సత్తయ్య గారు, బుగ్గరాజు, మల్లేష్, దాసరి శంకర్, శంకర్, మహేందర్, సాయి కిరణ్, రాకేష్, సచిన్, యువకులు పాల్గొన్నారు.