Kasipet Mandal News:-
కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో విద్యుత్
బిల్లుల వసూలు కౌంటర్లు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మూతబడ్డాయి. తాజాగా లాక్ డౌన్ నిబంధనల సవరణల నేపధ్యంలో మండలంలో ఆఫ్లైన్ కౌంటర్లను రిఓపెన్ చేశామని కాసిపేట మండల విద్యుత్ శాఖ అధికారి ఏఇ లక్ష్మణ్ గారు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సోషల్ డిస్టెన్స్ పాటిస్తు విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించి విద్యుత్ అపరాధ రుసుము నుండి మినహాయింపు పొందలని అయన సూచించారు.