Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో ఎండ వేడి తీవ్రరూపం
దాల్చుతుంది. గత వారం రోజుల నుండి పగటిపూట ఉష్ణోగ్రత అత్యధికంగా 46 డిగ్రీలుగా నమోదవుతుంది. ఎండ తాకిడి విపరీతంగా ఉండడంతో కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన వసంత్ కుమార్ అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెందాడు. వసంత్ కుమార్ ఒక లారీ డ్రైవర్. సోమవారం లారీ చెడిపోవడంతో ఎండలో శ్రమించి రిపేర్ చేసి వడదెబ్బకు గురయ్యారు. నిన్న ఉదయం లారీలో చనిపోయి ఉన్న వసంత్ కుమార్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు దేవాపూర్ ఎస్ఐ దేవయ్య గారు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.