Mancherial District News:-
మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో ఈరోజు
తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెల్లంపల్లి మండలం పెరకపల్లికి నుండి లక్షెట్టిపేటకు బైకుపై వెళ్తుండగా KK2 ఉపరితల గని సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు లక్షెట్టిపేటకు చెందిన సుజాత (35), కావ్య (19), మరొకరు బెల్లంపల్లి మండలం పెరకపల్లికి చెందిన కొమురయ్యగా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపి రెహమాన్, మందమర్రి సీఐ మహేష్ మరియు మందమర్రి ఎస్సై శివ పరిశీలించారు. మందమర్రి సీఐ మహేష్ గారు మాట్లాడుతూ ఉదయం 3, 4 గంటల సమయంలో ప్రమాదం జరిగి ఉండవచ్చన్నారు. ఆ సమయంలో ఎవరైనా ప్రయాణికులు సంఘటన స్థలం వద్ద ఉండి ఉంటే ప్రమాద వివరాలు తమకు తెలపాలని కోరారు.