Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో భారత మాజీ ప్రధాని
రాజీవ్ గాంధీ గారి 29వ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిద్దం తిరుపతి గారు మాట్లాడుతూ స్వర్గీయ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారని, అంతే కాకుండా గాంధీ కుటుంబం దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గరిబి హటవో, బ్యాంకుల జాతీయీకరణ, యువతకు 18 సంవత్సరములకే ఓటు హక్కు కల్పించిన, దేశంలో ప్రాజెక్టుల రూపకల్పన మొదలైన సంస్కరణలు తీసుకచ్చారని అన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాయమాటలతో, ప్రజల సెంటిమెంట్ తో, కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూకట్ల దేవేందర్, జాడి శివ, గాదం గట్టయ్య, మల్లెత్తుల రాజేశం , శ్రీనివాస్ లు పాల్గొన్నారు.