Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

అనాథలకు ఆపన్న హస్తం

Kasipet Mandal News:-
కాసిపేట్ మండలం సోనాపూర్ గ్రామంలోని
నాయికపు గూడలో అంజలి, అలియా, శ్రీరామ్ అనే ముగ్గురు చిన్నారులు తల్లితండ్రుల ప్రేమకు దూరమై అనాథలయ్యారు. రెండు సంవత్సరాల క్రితం వారి తండ్రి మరణించగా, తల్లి పిల్లలను విడిచివెళ్ళింది. ఇప్పుడు ఈ  ముగ్గురు చిన్నారులు తమ బాబాయి దగ్గర ఉంటున్నారు. అతని సంతానం ఇద్దరి పిల్లలతో పాటు, ఈ ముగ్గురిని అతనే చూసుకుంటున్నాడు. దానితో కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ పరిస్థితి తెలుసుకున్న జాడి రమేష్ కుమార్ (ZPHM, లోకేశ్వరం ), జాడి సుజాత (ZPHM, మెండోరా భీంగల్ ), జాడి శ్రీనివాస్( PGT-physics) లు వెయ్యి రూపాయల ఆర్థిక సహాయంతో పాటు, 15 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App