Mancherial District News:-
మంచిర్యాల జిల్లాలోని మందమర్రి కేకే2 సమీపంలో
గత శుక్రవారం గుర్తుతెలియని వాహనం బైకును ఢీ కొనడంతో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ గుర్తు తెలియని వాహనాన్ని పట్టుకోవడానికి మందమర్రి సీఐ మహేష్ గారు మరియు కాసిపేట ఎస్ఐ రాములు గారు చాలెంజింగ్ గా తీసుకోవడంతో నిన్న ఆదివారం వాహనాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సోమగూడెం చౌరస్తా వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా బైకు వెళుతున్న సమయంలో డీసీఎం వ్యాన్ వచ్చినట్లు గుర్తించారు. పలు చోట్ల రహదారులపై ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ఆ వాహనం మహారాష్ట్ర నాగపూర్ కి వెళ్లినట్లు గుర్తించి, వాహనంపై యాక్సిడెంట్ జరిగిన ఆనవాళ్లు ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వాహనానికి సంబంధించిన పలువురిని విచారిస్తున్నారు.