Mancherial District News:-
మంచిర్యాల జిల్లాలో కరోనా వైరస్ బాధితుల
సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా ఈరోజు జిల్లాలో మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, రోటికనిగూడలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటివరకు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27 కు చేరింది. వీరంతా ఉపాధి కోసం మహారాష్ట్ర వెళ్లి లాక్ డౌన్ నేపధ్యంలో ఇటీవల సొంత ఊళ్లకు తిరిగి వచ్చిన వారే.