Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఆందోళన అవసరంలేదు... 24గంటల్లో ఖాతాలో నగదు

Mancherial District News:-
రాష్టంలో రైతులు పండించిన పంట ధాన్యాన్ని
గ్రామాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈమేరకు మంచిర్యాల జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కరోనా వైరస్‌ వ్యాప్తి మరియు లాక్‌డౌన్‌ వంటి ప్రతి కూల పరిస్థితులలో కూడా జిల్లాలో ఇప్పటివరకు మొత్తం లక్షా 16 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని అన్నారు. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే నగదు వారి ఖాతాల్లో జమ అవుతుందని, ఈ విషయంలో రైతులు ఎవరూ ఆంవదోళన చెందాల్సిన అవసరంలేదనీ ఆయన పేర్కొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App