Kasipet Mandal News:-
కాసిపేట మండలం పల్లంగుండా గ్రామ పంచాయతి పరిధిలోని గంగు గూడలో ఈరోజు ముత్యంపల్లి MRPS గ్రామ కార్యవర్గం వారు నలబై కుటుంబాలకు బియ్యం, కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముందు సాంస్కృతిక కార్యక్రమం ద్వారా ఆట పాటలతో గిరిజనులకు కరోనాపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాకారులు ప్రముఖ రచయిత మరియు గాయకులు గొడిశెల బాపు, గొడిశెల క్రిష్ణ, గొడిశెల చిన్న క్రిష్ణ, చొప్పదండి కిషన్, మేర్గు రామ్మూర్తి, గొడిశెల శ్రీనివాస్, కోటాను రాజేష్ గార్లు ఆట పాటలతో అవగాహన కల్పించారు. ఇట్టి కార్యక్రమంలో గొడిశెల భీమయ్య, లంక లక్ష్మణ్, గారె శంకర్, దాసరి లింగయ్య, దాసరి రాజయ్య, దాసరి శంకర్, గొడిశెల సురెందర్, గొడిశెల రమేష్, చొప్పదండి శ్రీనివాస్, తదితరులు MRPS నాయకులు పాల్గొన్నారు.