Kasipet Local News:-
ఈ రోజు కాసిపేట గ్రామంలో తెరాస నాయకులు
ఇంటింటికి కూరగాయలు పంపిణి చేసారు. కరోనా వైరస్ దృష్ట్యా కూరగాయలు పంపిణి ఒక్క దగ్గర ఉండి చేస్తే ప్రజలు గుమ్మికూడే ప్రమాదం ఉంది కావున ఇంటింటికి వెళ్లి కూరగాయలను అందజేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, ఎంపీపీ రొడ్డ లక్ష్మి, తెరాస కాసిపేట్ మండలం ప్రెసిడెంట్ బొల్లు రమణ రెడ్డి, వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రం రావు, కాసిపేట సర్పంచ్ దారావత్ దేవి, ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి, ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, ఓసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు తిరుపతి రెడ్డి, భూమయ్య, రమేష్ మరియు తెరాస కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.