Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ప్రారంభమైన ఉత్పత్తి ప్రక్రియ

Kasipet News/Singareni:-
కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ లో భాగంగా
సింగరేణి యాజమాన్యం లే అఫ్ ప్రకటించడంతో గత 50రోజులుగా భూగర్భ గనులలో అత్యవసర పనులు మినహా ఇతర కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఈరోజు సింగరేణి గనులు తెరుచుకున్నాయి. కాసిపేట మండలంలో ఉన్న రెండు భూగర్భ గనులలో కూడా ఉత్పత్తి పక్రియ మొదలయింది. ఇప్పటికి దేశంలో మరియు రాష్టంలో కెసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉండడంతో కార్మికులలో కొంత భయాందోళన నెలకొంది. జిల్లాలో వలసకార్మికుల కేసుల మినహా లోకల్ కేసులు లేకపోవడం సానుకూలాంశం.  

సాధ్యం కానీ భౌతిక దూరం
గనులలో పనులు ఒకరికొకరు సహకారం అందిస్తూ కలిసికట్టుగా చేసేలా ఉండడంతో కార్మికులు పనిచేసే సమయంలో భౌతిక దూరం పాటించడం సాధ్యం కాదు. కార్మికులు పరిశుభ్రత పాటిస్తూ, మాస్కు ధరించి పనిచేయాలి. మరోవైపు సింగరేణి యాజమాన్యం కూడా రక్షణతో కూడిన ఉత్పత్తితో పాటు, పరిసరాల శుభ్రత, వ్యక్తిగత శుభ్రత పాటించాలని, మాస్కులు ధరించాలని  కార్మికులకు అవగాహనా కల్పిస్తున్నాయి. రక్షణ విషయంలో సింగరేణి యాజమాన్యం తీసుకునే చొరవ అందరికి తెలిసిందే.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App