Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం
చిన్నయ్య గారు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. మొత్తం 32 లబ్ధిదారులకు చెక్కులను గురువారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ తో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని, కరోనా వైరస్ కి విరుగుడు భౌతిక దూరం పాటించడమేనని పేర్కొన్నారు. రైతులు వరి ధాన్యం భద్రపరచడానికి బెల్లంపల్లి ఏఎంసి లో గిడ్డంగిని అందుబాటులో ఉంచడం జరిగిందని, అవసరమైతే కాసిపేటలో కూడా గిడ్డంగి ని రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ భూమేశ్వర్, ఎంపీడీవో అలీం, ఎంపీపీ రోడ్డ లక్ష్మి, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, జడ్పిటిసి పల్లె చంద్రయ్య, పిఎసిఎస్ చైర్మన్ నీలా రాంచందర్, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, మండల నాయకులు పాల్గొన్నారు.